
సిద్దిపేట రూరల్, వెలుగు : సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఆనంద్ దర్శిని టిఫిన్ సెంటర్ లో అగ్ని ప్రమాదం జరిగింది. ఉదయం టిఫిన్ తయారు చేయడానికి సిబ్బంది గ్యాస్ ఆన్ చేయగా సిలిండర్ నుంచి గ్యాస్ లీకై ఒక్కసారిగా దట్టమైన పొగ, మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన హోటల్ సిబ్బంది, స్థానికులు వెంటనే హోటల్ నుంచి బయటకు పరుగులు తీసి పైర్ సిబ్బంది కి సమాచారం అందించారు.
సంఘటన స్థలానికి చేరుకున్న పైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. హోటల్ లోని కొంత సామగ్రి మంటల్లో దగ్ధమయ్యాయి. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.