హైదరాబాద్ సిటీలో అగ్నిప్రమాదం.. మణికొండ ఏరియాలోని భారీ అపార్ట్ మెంట్ లోని ఓ ప్లాట్ లో మంటలు చెలరేగాయి. ప్లాట్ మొత్తం కాలిపోయింది.. ఇంట్లో సామాను కాలి బూడిద అయ్యాయి. టీవీ, ఫ్రిడ్జ్, సోఫాలు, బెడ్స్ ఇలా అన్నీ మంటలకు కాలిపోయాయి.
డిసెంబర్ 25వ తేదీ ఉదయం 11 గంటల సమయంలో షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు మొదలయ్యాయి. ఇంట్లో గమనించి.. మంటలను ఆర్పేందుకు ప్రయత్నించిన ఇంట్లోని వారికి అది సాధ్యం కాలేదు.. దీంతో ప్రాణాలకు కాపాడుకునేందుకు ప్లాట్ నుంచి బయటకు పరుగులు తీశారు. కళ్ల ఎదుటే ఇంట్లోని ప్రతి వస్తువు మంటలకు కాలిపోతుంటూ.. ఏమీ చేయలేక నిస్సాహయంగా చూస్తూ ఉండిపోయారు. ఫైర్ సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేయటంతో.. పక్కనే ఉన్న ప్లాట్ ఓనర్లు, అపార్ట్ మెంట్ లోని మిగతా ప్లాట్లు వారు ఊపిరి పీల్చుకున్నారు.
ప్లాట్ మొత్తం మంటలు వ్యాపించటంతో.. ఇంట్లోని బీరువాల్లో విలువైన వస్తువులు కాలిపోయాయి. డాక్యుమెంట్లు, డబ్బులు, బంగారం లాంటి వస్తువులు కూడా ఇప్పుడు బూడిదగా కనిపిస్తున్నాయి. దీంతో ఆ ప్లాట్ లోని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరు అవుతున్నారు.