బార్ అండ్ రెస్టారెంట్​లో అగ్నిప్రమాదం

బార్ అండ్ రెస్టారెంట్​లో అగ్నిప్రమాదం

ఉప్పల్, వెలుగు: ఉప్పల్ రింగ్ రోడ్ సమీపంలోని శ్రీ భాగ్య బార్ అండ్ రెస్టారెంట్​లో అగ్నిప్రమాదం జరిగింది. రోజు మాదిరిగానే సోమవారం ఉదయం బార్ తెరిచిన సిబ్బంది.. కరెంట్ స్విచ్​లు ఆన్ చేయగా, షార్ట్ సర్క్యూట్​తో మంటలు చెలరేగాయి. ఫైర్ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వారు ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పివేశారు. ప్రమాదంలో బిల్లు కౌంటర్ వద్ద ఉన్న కంప్యూటర్లు దగ్ధం అవ్వడం మినహా పెద్దగా నష్టం జరగలేదని బార్ యాజమాన్యం తెలిపింది. 

అయితే, బార్ లో ఎటువంటి ఫైర్ సేఫ్టీ ఏర్పాట్లు చేయలేదని ఫైర్ సేఫ్టీ అధికారి కిషన్ ప్రశ్నించడంతో.. యాజమాన్యం గొడవకు దిగారు. ప్రశ్నించిన విలేకరులపై కూడా దురుసుగా ప్రవర్తించారు. ఉదయం జరిగిన ప్రమాదంలో అగ్నికీలలు చుట్టూ వ్యాపిస్తే పెద్ద ప్రమాదం జరిగేదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. ఫైర్ సేఫ్టీ లేకుండా ఏర్పాటుచేసిన బార్​ను సీజ్ చేయాలని డిమాండ్ చేశారు.

సోఫా తయారీ​ షాపులోనూ..

చందానగర్: చందానగర్ గుల్మోహర్ ​పార్కు సమీపంలోని హెచ్​పీ పెట్రోల్ బంక్ ఎదురుగా.. మియాపూర్​దీప్తీశ్రీనగర్​కు చెందిన జగదీశ్​పాటిల్ నాలుగేండ్లుగా సోఫా వర్క్​షాప్​నిర్వహిస్తున్నాడు. ఆదివారం రాత్రి షాప్ ను​ క్లోజ్​ చేసి ఇంటికి వెళ్లాడు. అర్ధరాత్రి దాటిన తర్వాత షాప్​నుంచి మంటలు రావడంతో.. స్థానికులు ఫైర్​ సిబ్బందికి సమాచారం ఇవ్వగా, వారు వచ్చి మంటలను అదుపు చేశారు.

 ప్రమాదంలో షాప్​లోని ఫర్నిచర్, మిషన్లు, విండోస్​ పూర్తిగా కాలిపోయాయి. అయితే, షాప్​వెనుక భాగంలో ఖాళీ స్థలం ఉండడంతో కొందరకు అక్కడ చెత్తచెదారాన్ని పారబోయడం, గుర్తు తెలియని వ్యక్తి దానికి నిప్పు పెట్టడంతో మంటలు షాప్​లోకి వ్యాపించినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదానికి కారణమైన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని షాప్​ ఓనర్​ జగదీశ్​చందానగర్​ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.