తాడ్వాయి బీఎస్ఎన్ఎల్ ఆఫీసులో అగ్ని ప్రమాదం

తాడ్వాయి బీఎస్ఎన్ఎల్ ఆఫీసులో అగ్ని ప్రమాదం

తాడ్వాయి, వెలుగు:  తాడ్వాయి మండల కేంద్రంలోని బీఎస్ఎన్ఎల్ ఆఫీస్ లో మంగళవారం పిడుగుపాటుకు అగ్ని ప్రమాదం జరిగింది.  దీంతో  వైరింగ్ తో పాటు, పలు విలువైన పరికరాలు కాలిపోయాయి. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు అప్రమత్తమై బీఎస్ఎన్ఎల్  సిబ్బందికి  ఫైర్ ఇంజిన్ కి సమాచారం ఇచ్చారు. ఫైర్ ఇంజిన్ వచ్చి మంటలు ఆర్పగా..  తాడ్వాయి మండల పరిధిలోని సెల్ ఫోన్, ల్యాండ్ లైన్, బ్రాడ్ బ్యాండ్ సేవలు నిలిచిపోయాయి.