తమిళనాడులో భారీ అగ్ని ప్రమాదం... బాణాసంచా గోడౌన్ లో చెలరేగిన మంటలు....

తమిళనాడులో భారీ అగ్ని ప్రమాదం... బాణాసంచా గోడౌన్ లో చెలరేగిన మంటలు....

తమిళనాడులో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. బాణాసంచా గోడౌన్లో పేలుడు సంభవించటంతో భారీగా మంటలు ఎగసిపడ్డాయి. తమిళనాడులోని విరుద్ నగర్ జిల్లాలో చోటు చేసుకుంది ఈ ఘటన. చాటూరులోని ఓ ప్రయివేటు గోడౌన్ లో దీపావళి కోసం భారీగా బాణాసంచా నిల్వ ఉంచటంతో ప్రమాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో అగ్నిప్రమాదం జరగటంతో భారీగా ఆస్తి నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. 

గంటపాటు పాటు భారీ శబ్దాలతో భారీగా మంటలు చెలరేగతంతో ఫైర్ సిబ్బంది సమీప ప్రాంతాలకు వెళ్ళటానికి ఇబ్బందిగా మారింది.ఈ ప్రమాదంలో మంటల్లో ఎవరైనా చిక్కుకున్నారా అన్నది తెలియాల్సి ఉంది.