
సంగారెడ్డి జిల్లాలో ఇండస్ట్రీయల్ ఏరియాలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. గడ్డపోతారంలోని హెటిరో ల్యాబ్స్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. ఈటీపీ సెక్షన్ లో సాల్వెంట్ రికవరీ చేస్తుండగా మే 27వ తేదీ సోమవారం మధ్యాహ్నం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో వెంటనే సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చాయి. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ అగ్నిప్రమాదం వలన భారీగా ఆస్తి నష్టం సంభవించినట్లు తెలుస్తోంది. సంగారెడ్డి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.