![కాటేదాన్ పారిశ్రామికవాడలో భారీ అగ్ని ప్రమాదం](https://static.v6velugu.com/uploads/2025/02/fire-accident-at-katedan-industrial-park_yQJIOcTAul.jpg)
శంషాబాద్, వెలుగు: కాటేదాన్ పారిశ్రామిక వాడలోని బ్యూటీ కాస్మొటిక్ గోదాంలో ఆదివారం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ప్రమాదాన్ని గమనించిన ఓనర్ ఆర్ కే రింకు కుమార్ జైన్ గీవరా చాంద్ జైన్ పోలీసులకు,ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు.
ఫైర్ సిబ్బంది వచ్చి మంటలు అదుపులోకి తెచ్చారు. దాదాపు నాలుగు గంటల పాటు శ్రమించి మంటలు ఆర్పేశారు. ప్రమాదంలో దాదాపుగా రూ. 5 లక్షల వరకూ ఆస్తి నష్టం జరిగింది.