మాణిక్ ప్రభు ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం

సైదాబాద్ చౌరస్తాలోని మాణిక్ ప్రబు ఆసుపత్రిలో అగ్నిప్రమాదం జరిగింది. సోమవారం (నవంబర్ 11) రాత్రి ఆసుపత్రిలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. గమనించిన ఆసుపత్రి సిబ్బంది వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది సహయక చర్యలు చేపట్టారు.

ALSO READ | పేలుడు ఎలా జరిగింది..? తెలంగాణ స్పైసీ కిచెన్‎ను పరిశీలించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్

 ఫైరింజన్ సమయంతో అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఆసుపత్రిలో అగ్ని  ప్రమాదం జరగడంతో రోగులు తీవ్ర భయందోళనకు గురి అయ్యారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో రోగులు, ఆసుపత్రి సిబ్బంది, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. హాస్పిటల్ అగ్ని ప్రమాదం సంభవించడానికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. కాగా, ఈ  ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.