హైదరాబాద్ సిటీలో పెట్రోల్ ట్యాంకులో మంటలు.. జస్ట్ మిస్.. లేకపోతే బీభత్సమే

హైదరాబాద్ నాంపల్లిలోని ఏక్ మినార్ కూడలి వద్ద అగ్ని ప్రమాదం జరిగింది. ఏక్ మినార్ సర్కిల్‎లో ఉన్న పెట్రోల్ బంక్‎లో ఇంధనం నింపడానికి వచ్చిన ట్యాంకర్‎లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఇంధనం ధాటికి పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడ్డాయి. మెయిన్ రోడ్డు పక్కనే బంక్ ఉండటంతో వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర భయందోళనకు గురై పరుగులు తీశారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హూటాహుటిన ఘటన స్థలానికి చేరుకుంది. ఫైరింజన్ల సహయంతో ఎగిసిపడుతోన్న మంటలను అదుపులోకి తీసుకొచ్చారు సిబ్బంది. 

ALSO READ | హైదరాబాద్ లోనే బడా ఎగ్జిబిషన్.. నుమాయిష్ మళ్లీ వచ్చేస్తుంది..!

రోడ్డు పక్కనే బంక్ ఉండటంతో నాంపల్లి ఏరియాలో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. రంగంలోకి దిగిన ట్రాఫిక్ పోలీసులు వాహనాల రద్దీని క్లియర్ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. పెట్రోల్ బంకులో అగ్ని ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో పోలీసులు, బంక్ సిబ్బంది ఊపిరి పీల్చుకుంది. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.