- యాదాద్రి భువనగిరి జిల్లా ఎల్లంబాయిలో ఘటన
- సుమారు 30 కోట్ల ఆస్తి నష్టం
చౌటుప్పల్, వెలుగు : యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం ఎల్లంబాయి గ్రామ పరిధిలోని ఓజో అగ్రో కెమికల్ పరిశ్రమలో బుధవారం అర్ధరాత్రి షార్ట్‌సర్క్యూట్ తో భారీ అగ్ని ప్రమాదం జరిగింది.ఫైర్ సిబ్బంది రెండు ఫైర్ ఇంజిన్ల సాయంతో మంటలను అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నించారు. కానీ, మంటలు భారీగా ఎగిసిపడడంతో ఉదయం 8 గంటల వరకు కూడా అదుపులోకి రాలేదు. అప్పటికే పరిశ్రమలోనే ఫర్టిలైజర్స్, ఫెస్టిసైడ్స్‌కు సంబంధించిన మెటీరియల్ పూర్తిగా దగ్ధమైంది.
కంపెనీ యజమాని కథనం ప్రకారం..ఫ్యాక్టరీలో ఫర్టిలైజర్, ఫెస్టిసైడ్స్తయారు చేస్తుంటారు. బుధవారం అర్ధరాత్రి ఒంటిగంటకు కార్మికులందరూ వెళ్లిన తర్వాత ప్లాంట్‌లో షార్ట్‌సర్క్యూట్ తో అగ్ని ప్రమాదం జరిగింది. దీంతో రెండు బ్లాకుల్లో ఉన్న సామగ్రి అంతా పూర్తిగా కాలిపోయింది. దీంతో రూ.30 కోట్ల ఆస్తి నష్టం జరిగింది. ప్రమాద సమయంలో కార్మికులు ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం జరగలేదు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.