రంగారెడ్డి జిల్లాలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. నార్సింగ్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ హైదర్ షాకోట్ ఓల్డ్ విలేజ్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలు గమనించిన స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. సమాచారం తెలుసుకున్న అగ్ని మాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఇంట్లో దీపం పెట్టి గుడి వెళ్లి వచ్చేసరికి ఇంట్లో ఒక్కసారిగా మంటలు దట్టమైన పొగ కమ్ముకుందని యజమాని తెలిపారు.
భయాందోళనతో ఫైర్ పోలీసులకు ఫోన్ చేయగా వారు వచ్చి మంటలను అదుపు చేసినట్టు తెలిపారు. ఇంట్లో ఎవ్వరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఘటన పై కేసు నమోదు చేసుకుని విచారణ చేపడతామని పోలీసులు తెలిపారు.