![సాహితీ ల్యాబ్స్ లో పేలిన రియాక్టర్లు.. ఇద్దరు ఉద్యోగులు మృతి](https://static.v6velugu.com/uploads/2023/06/fire-accident-at-Sahithi-Pharma_RU2GpM47O0.jpg)
అనకాపల్లి జిల్లా అచ్చూతాపురం సెజ్ లో అగ్నిప్రమాదం జరిగింది. సాహితీ ఫార్మా ల్యాబ్స్ లో రియాక్టర్ పేలింది. ఈ ఘటనలో ఇద్దరు ఉద్యోగులు అక్కడికక్కడే మృతి చెందారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి.
పేలుడు శబ్ధం విన్న కార్మికులు ఫార్మా ల్యాబ్ లో నుంచి భయంతో బయటకు పరుగులు తీశారు. ల్యాబ్ లో మంటలు భారీగా ఎగసిపడుతున్నాయి. చుట్టపక్క ప్రాంతాలకు పొగ కమ్మేసింది. సమాచారం అందుకున్న అగ్నమాపక సిబ్బంది మంటలు ఆరుపుతున్నారు.
రెస్క్యూ అపరేషన్ వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ కు మంత్రి అమర్ నాథ్ ఆదేశాలు జారీ చేశారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలన్నారు.