రాజేంద్రనగర్‌లో అగ్ని ప్రమాదం.. ఎగిసిపడుతున్న మంటలు

రాజేంద్రనగర్ పరిధిలోని శివరాంపల్లిలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఓ బట్టల దుకాణంలో మంటలు వ్యాపించాయి. ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. మంటలుఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. దుకాణ సిబ్బంది ఇరుగుపొరుగు వారి సాయంతో మంటలు ఆర్పివేసే ప్రయత్నం చేస్తున్నారు.

Also Read :-  రత్నదీప్ సూపర్ మార్కెట్లలో ఫుడ్ సేప్టీ తనిఖీలు

 ఇప్పటికే దుకాణ యజమాని అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. కాసేపట్లో ఫైరింజన్లు అక్కడికి చేరుకోనున్నాయి. ప్రమాదం ఎలా జరిగిందనేది తెలియరాలేదు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.