ఫార్మా కంపెనీలో అగ్నిప్రమాదం.. భారీగా చెలరేగిన మంటలు..

నల్గొండలో అగ్నిప్రమాదం చోటు చేసుకుతుంది. జిల్లాలోని చిట్యాల మండలం గుండ్రపల్లిలో ఉన్న శ్రీపతి ఫార్మా కంపెనీలో భారీగా మంటలు చెలరేగాయి. కంపెనీలోని Q3 బ్లాక్ లో రియాక్టర్ వద్ద భారీగా మంటలు చెలరేగాయి.ఎగిసిపడుతున్న మంటలను చూసి భయాందోళనకు గురైన స్థానికులు 100 నెంబర్ కు పిర్యాదు చేశారు.

స్థానికుల ఫిర్యాదుతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెస్తుంన్నారు. మంటల్లో చిక్కుకున్న కంపెనీ సిబ్బందిని సేఫ్ గా బయటకు తీసుకొచ్చారు పోలీసులు.అయితే, ప్రమాదానికి కారణాలు తెలియాల్సి ఉంది.కంపెనీ ఊరికి సమీపంలో ఉండటంతో గ్రామస్థులు భయాందోళనకు గురవుతున్నారు.