![విశాఖ రైల్వేస్టేషన్లోనే తగలబడిన రైలు బోగీలు](https://static.v6velugu.com/uploads/2024/08/fire-accident-at-visakhapatnam-railway-station_u8xOsAQ3mR.jpg)
విశాఖపట్నం రైల్వేస్టేషన్‌లో అగ్ని ప్రమాదం నెలకొంది. విశాఖపట్నం రైల్వేస్టేషన్‌లో ఆగి ఉన్న రైలులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. కోర్బా నుంచి విశాఖ చేరుకున్న తిరుమల ఎక్స్‌ప్రెస్ రైలు ఏసీ బోగీల్లో ఈ మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో బీ 6, బీ 7, ఎం 1 ఏసీ బోగీలు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఆ సమయంలో రైలులో ప్రయాణికులెవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. రైల్వే సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొస్తున్నారు. దీంతో రైల్వే స్టేషన్ పరిసరాల్లో పొగ దట్టంగా కమ్ముకుంది.