మియాపూర్, వెలుగు: మియాపూర్ గోకుల్ ప్లాట్స్‌లో శనివారం అగ్ని ప్రమాదం జరిగింది. ఇంట్లోని ఫర్నిచర్, ఇతర గృహోపకరణ వస్తువులు, విలువైన డాక్యుమెంట్లు కాలిబూడిదయ్యాయి. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గోకుల్‌ప్లాట్స్ వెంకటరమణ కాలనీలోని ఎస్అండ్ఎస్అపార్ట్మెంట్ఫస్ట్ ఫ్లోర్లో మోహన్‌దాస్, కృష్ణవేణి దంపతులు నివసిస్తున్నారు. శనివారం మధ్యహ్నం 2 గంటల సమయంలో వీరి ఇంట్లోని హాల్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి.
మోహన్ దాస్ బయటకు పరుగులు తీయగా, కృష్ణవేణి బాల్కనీలో చిక్కుకుంది. గమనించిన స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. మాదాపూర్ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకుని కృష్ణవేణిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. మంటలను అదుపు చేశారు. కిచెన్‌లోకి మంటలు వెళ్లకుండా చూడడంతో పెను ప్రమాదం తప్పింది. హాల్లోని ఫర్నిచర్, ఇతర గృహోపకరణాలు, విలువైన సామాగ్రి పూర్తిగా కాలి బూడిదయ్యాయి.