యాదాద్రి జిల్లాలో నాలుగు పత్తి గోదాంలు దగ్ధం

యాదాద్రి భువనగిరి జిల్లాలో ఈ రోజు సాయంత్రం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది.  వలిగొండ మండలం టేకులసోమవారం శివారులోని పత్తి గోదాంలో మంటలు చెలరేగి పెద్ద ఎత్తున వ్యాపించాయి. సమాచారం అందుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది తక్షణమే అక్కడికి చేరుకొని మంటలు ఆర్పే చర్యలు చేపట్టారు. నాలుగు గోదాములలో ఉన్న పత్తి పూర్తిగా దగ్ధం అయ్యింది. రెండు ఫైర్ ఇంజన్లు మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నా మంటలు అదుపులోకి రాలేదు. దీంతో జేసీబీ సాయంతో గోదాం గోడలను కూల్చివేస్తున్నారు.  షార్ట్ సర్క్యూట్ కారణంగానే  అగ్ని ప్రమాదం జరిగి ఉంటుందని అనుకుంటున్నారు.