చాలా మంది ఇళ్లలో స్నానం చేయటానికి వాటర్ హీటర్ వాడుతుంతారు.. వాటర్ హీటర్ వాడే సమయంలో అప్రమత్తంగా లేకపోతే కరెంట్ షాక్ కొడుతుందని అందరికీ తెలిసిన సంగతే. కానీ.. మనం రోజూ వాడే వాటర్ హీటర్ వల్ల అగ్నిప్రమాదం జరుగుతుందని తెలుసా... అవును హైదరాబాద్ లోని నాచారంలో ఈ అగ్నిప్రమాదం గురించి తెలిస్తే వాటర్ హీటర్ వాడాలంటే భయపడతారు. నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలోని మల్లాపూర్ లో మీర్పేట్ లోని ఓ ఇంట్లో చోటు చేసుకుంది ఈ అగ్ని ప్రమాదం.
ఓ ఇంట్లో స్నానం చేయడానికి బకెట్ లో హీటర్ పెట్టి బయటకు వెళ్ళాగా.. వచ్చేసరికి అగ్ని ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. హీటర్ పెట్టిన సమయంలో ఎవరు ఇంట్లో లేకపోవడంతో ప్రాణం నష్టం సంభవిచలేదు. అగ్ని ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు.