సౌత్ ముంబైలోని ఓ హోటళ్లో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం నుంచి 25 మంది డాక్టర్లు ప్రాణాలతో బయటపడ్డారు. కరోనా మహమ్మారి కారణంగా నగరంలోని వివిధ హోటళ్ళు మరియు లాడ్జీలలో వైద్యులు మరియు నర్సులతో సహా అత్యవసర మరియు అవసరమైన సేవా సిబ్బందికి బాంబే మున్సిపల్ కార్పొరేషన్ తాత్కాలిక వసతిని ఏర్పాటు చేసింది. అదే విధంగా.. సౌత్ ముంబైలోని మెట్రో సినిమా సమీపంలోని 1వ మెరైన్ వీధిలో ఉన్న హోటల్ ఫార్చ్యూన్‌లో కరోనా డ్యూటీ చేస్తున్న డాక్టర్ల కోసం గదులు కేటాయించారు. వారంతా గదులలో ఉండగానే బుధవారం రాత్రి పెద్ద అగ్నిప్రమాదం సంభవించినట్లు అధికారులు తెలిపారు. హోటళ్లోని మొదటి మరియు మూడవ అంతస్తులలో మంటలు వ్యాపించినట్లు ఫైర్ సిబ్బంది తెలిపారు. ఎలక్ట్రిక్ వైర్లలో షాక్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగినట్లు ఫైర్ అధికారి ఒకరు తెలిపారు. విషయం తెలిసిన వెంటనే ఎనిమిది ఫైర్ ఇంజన్లు ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపుచేశాయి.
For More News..