హైదరాబాద్ లోని అబిడ్స్‌లో అగ్నిప్రమాదం జరిగింది. ఓ కమర్షియల్ కాంప్లెక్స్ రెనవేషన్ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. తాజ్ మహల్ హోటల్ పక్కనే ఉన్న బిల్డింగ్ లో రెనవేషన్ లో భాగంగా వెల్డిండ్ చేస్తున్నప్పుడు నిప్పు రవ్వల రాలి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
దీంతో స్థానికులు భయంతో పరుగులు పెట్టారు. సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదం జరిగినప్పుడు ఘటనా స్థలంలో ఎవరూ లేకపోవడంతో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు.