ఏపీలో ఘోర అగ్నిప్రమాదం..బాణసంచా గోడౌన్లో పేలుడు..మంటల్లో నలుగురు సజీవ దహనం

ఏపీలో ఘోర అగ్నిప్రమాదం..బాణసంచా గోడౌన్లో పేలుడు..మంటల్లో నలుగురు సజీవ దహనం

ఏపీలోని అనకాపల్లిలో  ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఆదివారం ( ఏప్రిల్ 13) మధ్యాహ్నం ఓ బాణసంచా గోడౌన్ లో పేలుడు సంభవించి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ మంటల్లో నలుగురు సజీవ దహనమయ్యారు. మరో ఏడుగురు తీవ్ర గాయాలపాలయ్యారు. గాయపడ్డవారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.

కోటవురట్ల మండలం కైలాస పట్నంలో ఈ ఘటన చోటు చేసుకుంది. గోడౌన్ లో బాణసంచా ఉండటంతో అవి పేలుతూ పెద్ద ఎత్తున్న మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలార్పేందుకు ప్రయత్నిస్తున్నారు.   

►ALSO READ | ఆడుకుంటూ నీటి కుంటలో పడి ముగ్గురు చిన్నారులు మృతి

ప్రమాదంలో చనిపోయినవారంతా కూలీలుగా గుర్తించారు. పేలుడు ఘటనతో ఆ ప్రాంతమంతా భయానక వాతావరణం ఏర్పడింది. బాధితుల ఆర్తనాదాలు, చనిపోయిన వారి బంధువుల రోదనలతో  ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలముకున్నాయి. పేలుడుకు కారణాలు ఏంటనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.