అన్నపూర్ణ క్యాంటీన్​లో అగ్నిప్రమాదం

అన్నపూర్ణ క్యాంటీన్​లో అగ్నిప్రమాదం

బషీర్​బాగ్, వెలుగు: లిబర్టీలోని జీహెచ్ఎంసీ హెడ్డాఫీస్ పక్కనున్న రూ.5 భోజనం అన్నపూర్ణ క్యాంటీన్ షెడ్​లో మంగళవారం సాయంత్రం అగ్ని ప్రమాదం జరిగింది. మంటల్లో షెడ్​లో ఉన్న సామాగ్రి పూర్తిగా కాలిపోయింది. ప్రమాదం జరిగిన ప్రదేశం పక్కనే బస్టాప్ ఉండటంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు.

ఘటనా స్థలానికి చేరుకున్న సైఫాబాద్ పోలీసులు కేసు ఫైల్ చేశారు.  ప్రమాదవశాత్తు మంటలు వ్యాపించయా లేక ఎవరైనా కావాలనే నిప్పు పెట్టారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

 

Also Read : https://www.v6velugu.com/bandi-sanjay-responded-to-mim-leader-and-mp-asaduddins-comments