హైదరాబాద్ అయ్యప్ప సొసైటీలోని ఆఫీస్లో భారీ అగ్నిప్రమాదం

హైదరాబాద్ అయ్యప్ప సొసైటీలోని ఆఫీస్లో భారీ అగ్నిప్రమాదం

హైదరాబాద్: మాదాపూర్లోని అయ్యప్ప సొసైటీలో ఉన్న ఒక ప్రైవేట్ కంపెనీలో అగ్నిప్రమాదం జరిగింది. 100 ఫీట్ రోడ్ YSR విగ్రహం దగ్గర ప్రైవేట్ కంపెనీలోని యూపీఎస్లో ఒక్కసారిగా మంటలొచ్చాయి. ఉద్యోగుల అలర్ట్ కావడంతో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఈ  అగ్ని ప్రమాదానికి సంబంధించి ఫైర్ డిపార్ట్మెంట్కు వెంటనే సమాచారం అందించారు. రెండు ఫైర్ ఇంజిన్లు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. స్వల్ప ఆస్తి నష్టం వాటిల్లింది. 2024, జనవరి 1న సాయంత్రం ఈ ఘటన జరిగింది.

న్యూ ఇయర్ కావడం, కొందరు ఉద్యోగులు అప్పటికే వర్క్ ముగించుకుని వెళ్లిపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. హైటెక్ సిటీకి కూతవేటు దూరంలోనే అయ్యప్ప సొసైటీ ఉంటుంది. అయ్యప్ప సొసైటీ ఏరియాలో ఐటీ రిక్రూటింగ్ కంపెనీలు ఎక్కువగా ఉన్నాయి. హైదరాబాద్​ సిటీలోనే ఇది వన్ ఆఫ్ ది కాస్ట్​లీ ఏరియా. విప్రో జంక్షన్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, నానక్​రాం గూడ, బయోడైవర్సిటీ జంక్షన్, రాయదుర్గం నాలెడ్జ్​ సిటీ, మైండ్​స్పేస్​ జంక్షన్లకు అయ్యప్ప సొసైటీ దగ్గరగా ఉంటుంది. ఐటీ ఉద్యోగులు, కంపెనీ ప్రతినిధులు ఉండే కాలనీల్లో అయ్యప్ప సొసైటీ కూడా ఒకటి.

ఇదిలా ఉండగా.. నూతన సంవత్సర వేడుకల కోసం పిండి వంటలు చేసే క్రమంలో గ్యాస్ సిలిండర్ లీక్ కావడంతో కొండాపూర్లోని గెలాక్సీ అపార్ట్మెంట్ లో అగ్ని ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఇంట్లో ఉన్న ఫ్రిజ్, వాషింగ్ మెషిన్, ఏసీలు, బెడ్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు, గీజర్ కాలి బూడిదయ్యాయి. మంటల కారణంగా అపార్ట్మెంట్ మొత్తం దట్టమైన పొగ అలుముకుంది. ఈ పొగ కారణంగా ఇబ్బంది పడుతూ మిగిలిన ఫ్లాట్లలో చిక్కుకున్న దాదాపు 10 మందిని అగ్నిమాపక సిబ్బంది రక్షించారు. అగ్ని ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. భారీగా ఆస్తి నష్టం మాత్రం జరిగింది.