బాన్సువాడ ఏరియా ఆసుపత్రిలో భారీ అగ్నిప్రమాదం.. ఎగసిపడుతున్న మంటలు

   బాన్సువాడ ఏరియా ఆసుపత్రిలో  భారీ అగ్నిప్రమాదం..  ఎగసిపడుతున్న మంటలు

బాన్సువాడ ఏరియా ఆసుపత్రిలో  2023 జూన్ 1  గురువారం రోజున  ఉదయం  అగ్ని ప్రమాదం జరిగింది. ఆసుపత్రి ఆపరేషన్ థియేటర్ లో  జరిగిన విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. దీంతో ఆసుపత్రిలో ఒక్కసారిగా  మంటలు చెలరేగాయి. దీంతో  పెద్ద ఎత్తున పొగ  వ్యాపించింది.  ఆసుపత్రిలోని  రోగులను  పై అంతస్తు నుంచి గ్రౌండ్ ఫ్లోర్ లోకి తరలిస్తున్నారు. మరోవైపు  ఆసుపత్రిలో మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు ఫైర్ ఇంజన్ సిబ్బంది. ఆపరేషన్ థియేటర్ లో  అగ్ని ప్రమాదానికి గల కారణాలపై  అధికారులు ఆరా తీస్తున్నారు.