బెల్ట్ అండ్ టై షాపుల్లో అగ్నిప్రమాదం

  • రూ.20 లక్షల ఆస్తి నష్టం

బషీర్ బాగ్, వెలుగు: నాంపల్లి స్టేషన్ రోడ్డులోని ఇస్కాన్ టెంపుల్ పక్కన ఉన్న బెల్ట్ అండ్ టై షాపుల్లో అగ్నిప్రమాదం జరిగింది. కింగ్స్ బెల్ట్, దాని పక్కనే ఉన్న అమెరికన్ బెల్ట్ అండ్ టై దుకాణాల్లో శుక్రవారం అర్ధరాత్రి షార్ట్  సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. స్థానికుల సమాచారంతో గౌలీగూడ ఫైర్ సిబ్బంది హుటాహుటిన అక్కడికి చేరుకొని మంటలను ఆర్పివేశారు. 

ప్రమాదంలో రూ.20 లక్షల ఆస్తి నష్టం వాటిల్లినట్లు బాధితులు అబిడ్స్ పీఎస్​లో ఫిర్యాదు చేశారు. పద్మారావునగర్: బన్సీలాల్​పేట డివిజన్​న్యూ బోయిగూడలోనూ అగ్నిప్రమాదం జరిగింది. ఐడీహెచ్​కాలనీలోని స్క్రాప్ దుకాణంలో శనివారం రాత్రి 10 గంటల సమయంలో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకొని మంటలు ఆర్పివేశారు. షాపు ఓనర్ దుకాణం మూసివెళ్లే ముందు దేవుడి ఫొటో వద్ద దీపం పెట్టగా, దాంతో మంటలు అంటుకున్నట్లు అనుమానం వ్యక్తమవుతోంది.