మహారాష్ట్ర భివాండిలో అగ్నిప్రమాదం జరిగింది. మూతపడిన క్లాత్ ఫ్యాక్టరీలో ఫైర్ యాక్సిడెంట్ జరగడంతో భారీగా ఆస్తి నష్టం వాటిల్లింది. ఈ ప్రమాదంలో కోట్ల విలువ చేసే ఆస్తి దగ్ధమైనట్లు పోలీసులు తెలిపారు. అగ్ని ప్రమాదం సంభవించడానికి గల కారణాలు తెలుసుకునే ప్రయత్నంలో పోలీసులు ఉన్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని.. ఆస్తినష్టం మాత్రమే జరిగిందని థానే మున్సిపల్ అధికారులు తెలిపారు.
For More News..