శివరాంపల్లిలో అగ్నిప్రమాదం.. పూర్తిగా దగ్ధమైన బట్టల షాపు..

రంగారెడ్డి జిల్లాలోని శివరాంపల్లిలో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఓ బట్టలషాపు పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటనకు సంబందించిన పూర్తి వివరాలిలా ఉన్నాయి.శివరాంపల్లి పివిఎన్‌ఆర్‌ ఎక్స్‌ప్రెస్‌వే పిల్లర్‌ నెంబర్‌ 294 దగ్గర ఉన్న శ్రీలక్ష్మి క్లాత్‌ సెంటర్‌ లో అగ్నిప్రమాదం జరిగింది. బుధవారం ( నవంబర్ 20, 2024 ) మధ్యాహ్నం షాపులో ఒక్కసారిగా ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. దీంతో దట్టమైన పోగ, మంటలతో ఆ ప్రాంతమంతా చుట్టుమిట్టింది.

ALSO READ | గచ్చిబౌలిలో ఒరిగిన ఐదంతస్తుల భవనం.. బిల్డర్ శ్రీనుపై కేసు నమోదు

స్థానికులు గమనించి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. స్థానికుల సమాచారంతో సంఘటన స్థలానికి చేరుకోని మంటలు అదుపులోకి తేచ్చేందుకు తీవ్రంగా శ్రమించారు అగ్నిమాపక సిబ్బంది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో షాపు పూర్తిగా దగ్ధమైనట్లు తెలుస్తోంది. గత 20 సంవత్సరాలుగా ఇక్కడ బట్టల షాపు నిర్వహిస్తున్నారని తెలుస్తుంది. ఈ ప్రమాదంలో సుమారు పది లక్షల వరకు ఆస్తినష్టం సంభవించి ఉండవచ్చునని భావిస్తున్నారు.