పరిగి, వెలుగు: షార్ట్ సర్క్యూట్ కారణంగా వికారాబాద్జిల్లాలోని ఓ కాటన్మిల్లు దగ్ధమైంది. పూడూరు మండలం రాకంచెర్ల గ్రామంలో కొనసాగుతున్న ‘రాకంచెర్ల కాటన్మిల్లు’లో గురువారం తెల్లవారుజామున 3 గంటల తర్వాత షార్ట్సర్క్యూట్జరిగి మంటలు చెలరేగాయి. గమనించిన సిబ్బంది పరిగి ఫైర్ స్టేషన్ కు సమాచారం ఇచ్చారు.
ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. అప్పటికే మిల్లులోని పత్తితోపాటు సామగ్రి కాలిబూడిదైంది. దాదాపు రూ.10 లక్షల ఆస్తి నష్టం వాటిల్లినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. అగ్ని ప్రమాదంపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు.