ఆర్టీసీ ఆధ్వర్యంలోని పెట్రోల్ బంక్ లో మంటలు

వరంగల్ అర్బన్: హన్మకొండలోని పాత బస్ డిపో దగ్గర లోని పెట్రోల్ బంక్ లో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి.  ఫైర్ సిబ్బందికి వెంటనే సమాచారమందించడంతో  వెంటనే రంగంలోకి దిగిన ఫైర్ సిబ్బంది ,సకాలంలో మంటలను ఆర్పివేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. ఈ పెట్రోల్ బంక్ ఆర్టీసీ ఆధ్వర్యంలో కొనసాగుతోంది. పెట్రోల్ బంక్ లో హఠాత్తుగా మంటలు చెలరేగడంపై అగ్నిమాపక శాఖ అధికారులు విచారణ జరుపుతున్నారు.