హైదరాబాద్ హయత్ నగర్ లోని ఓ పాత ఇంట్లో అగ్ని ప్రమాదం జరిగింది. సంక్రాంతి పిండి వంటలు చేస్తుండగా అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. హయత్ నగర్ లో గత కొంతకాలంగా ఓ పాత ఇంట్లో వృద్ధ దంపతులు అద్దెకు ఉంటున్నారు. పండుగ సందర్భంగా పిండి వంటలు చేస్తుండగా గ్యాస్ లీక్ కావడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలను ఆర్పేందుక దంపతులు ప్రయత్నించినా అదుపులోకి రాలేదు.
మంటలు అదుపులోకి రాకపోవడంతో స్థానికులను పిలిచారు దంపతులు. స్థానికులు మంటలు ఆర్పేందుకు తీవ్ర ప్రయత్నం చేసి.. ఫలితం లేకపోవడంతో అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలు ఆర్పేశారు. స్థానికుల అప్రమత్తతో పెను ప్రమాదం తప్పిందని ఊపిరి పీల్చుకున్నారు.
ALSO READ | Sankranti :సొంతూళ్లకు జనం..హైదరాబాద్ ఖాళీ