హోటల్ సోహైల్​లో అగ్ని ప్రమాదం.. ఒకరి మృతి

హోటల్ సోహైల్​లో అగ్ని ప్రమాదం.. ఒకరి మృతి

ఎల్​బీనగర్, వెలుగు: మలక్​పేటలోని సోహైల్ హోటల్​లో అగ్నిప్రమాదం చోటుచేసుకుని ఒకరు మృతి చెందారు. శుక్రవారం సాయంత్రం హోటల్​లోని కిచెన్​లో మంటలు చెలరేగి దట్టమైన పొగలు వ్యాపించాయి. ఆ టైంలో ఎక్కువ మంది సిబ్బంది ఉన్నప్పటికీ వెంటనే అప్రమత్తమై బయటికి పరుగులు తీశారు. పార్సిల్ సర్వీస్ కౌంటర్​లో పనిచేస్తున్న షాబుద్దీన్(36) పొగ దెబ్బకు ఊపిరి ఆడక మృతి చెందాడు.

కొంత మంది అస్వస్థతకు గురయ్యారు. ఒక్కసారిగా దట్టమై పొగలు వ్యాపించడంతో సోహైల్​హోటల్​పక్కనే ఉన్న మలక్ పేట గవర్నమెంట్​హాస్పిటల్​లోని పేషెంట్లు ఆందోళనకు గురయ్యారు. సిబ్బంది అప్రమత్తమైన వేరే బ్లాక్ లోకి తరలించారు. సమాచారం అందుకున్న ఫైర్​సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. షార్ట్ సర్క్యూట్ లేదా గ్యాస్ లీక్ కారణంగానే ప్రమాదం జరిగిందని, విచారణ చేస్తున్నామని డిస్ట్రిక్ట్ ​ఫైర్ ఆఫీసర్ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ప్రమాద స్థలానికి మలక్ పేట ఎమ్మెల్యే అహ్మద్​ బలాల పరిశీలించారు. కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.