హైదరాబాద్ నిజాంపేట్లో అగ్ని ప్రమాదం.. మూడు షాపులు దగ్ధం

హైదరాబాద్ నిజాంపేట్లో  అగ్ని ప్రమాదం.. మూడు షాపులు దగ్ధం

హైదరాబాద్ నిజాంపేట్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.  నిజాంపేట్ స్టూడియో సమీపంలోని టిఫిన్ సెంటర్ లో గ్యాస్ లీకవ్వడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సిలిండర్ వెలిగించే క్రమంలో ప్రమాదవశాత్తు ఒక్కసారిగా మంటలు చెలరేగి.. పక్కనే ఉన్న మరో మూడు షాపులకు వ్యాపించగా పూర్తిగా దగ్ధమయ్యాయి. స్థానికులు భయంతో పరుగులు తీశారు.

ఒక షాపు నుంచి మరో షాపుకు మంటలు వ్యాపిస్తుండటంతో  స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు . ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో పోలీసులు ఊపిరి తీసుకున్నారు.