![జనగామలో భారీ అగ్నిప్రమాదం](https://static.v6velugu.com/uploads/2025/02/fire-accident-in-janagama-detais-here_OWDn7F0Xes.jpg)
జనగామ, వెలుగు: జనగామ జిల్లా కేంద్రంలో బుధవారం రాత్రి భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. హైదరాబాద్ రోడ్డులోని జై భవానీ ఎలక్ట్రికల్ షాప్ లో రాత్రి 10.30 కి ప్రాంతంలో అగ్ని ప్రమాదం జరుగగా, సుమారు రూ.30 లక్షల ఆస్తి నష్టం జరిగింది. రోజులాగే దుకాణం బంద్ చేసిన యజమానులు కొద్దిసేపటికి పొగరావడం గమనించి పోలీసులకు, ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వారు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు. అప్పటికే దుకాణంలోని ఎలక్ట్రికల్ సామగ్రి కాలి బూడిదయ్యింది.