జూబ్లీహిల్స్ లోని క్లాత్ షోరూంలో అగ్నిప్రమాదం.. ఎగిసిపడుతున్న మంటలు

జూబ్లీహిల్స్ లోని క్లాత్ షోరూంలో అగ్నిప్రమాదం.. ఎగిసిపడుతున్న మంటలు

హైదరాబాద్  నగరంలో వరుస అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. మంగళవారం (జూన్ 25) ఒక్కరోజే జూబ్లీహిల్స్ లో రెండు చోట్ల అగ్నిప్రమాదం జరిగింది. మంగళ వారం సాయంత్రం జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 36 లో పోలీస్ స్టేషన్ కు ముందున్న  ఫ్యాబ్ ఇండియా క్లాత్స్ షో రూమ్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. షో రూం గోదాం నుండి దట్టమైన పొగలు అలముకున్నాయి.మంటలు భవనం మొత్తం వ్యాపించాయి.దీంతో జనం పరుగులు పెట్టారు. స్థానికుల సమాచారంతో సంఘటన స్థలా నికి చేరుకున్న  ఫైర్ సిబ్బంది  మంటలను అదుపులోకి తెచ్చేందుకు శ్రమిస్తున్నారు. షోరూంలో పనిచేస్తున్న 50 మందికి పైగా సిబ్బంది సురక్షితంగా బయట పడ్డారు. ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. షార్ట్ సర్క్యూట్ కారణంగా  ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. 

మరోవైపు మంగళవారం మధ్యాహ్నం జూబ్లీహిల్స్ లోని జర్నలిస్టు కాలని బస్టాప్ ఎదురుగా ఉన్న భవనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలు చూసి భయబ్రాంతులకు గురైన జనం బయటకు పరుగులు తీశారు. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకని మంటలను అదుపు చేశారు. షార్ట్ సర్క్యూట్ వల్ల పార్కింగ్ ఏరియాలో మంటలు చెలరేగి ఉండొచ్చని స్థానికులు అనుమానిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా పార్కింగ్ ఏరియాను భవనం ఓనర్స్ స్టోర్ రూమ్ గా వాడుతున్నట్టు తెలుస్తుంది.