కాజిపల్లి పారిశ్రామికవాడలోని అగ్ని ప్రమాదం.. ఫ్యాక్టరీలో పెద్ద ఎత్తున ఎగసిపడ్డ మంటలు

సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం కాజిపల్లి పారిశ్రామిక వాడలోని ఆరోరా లైఫ్ సైన్స్ పరిశ్రమలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. గురువారం తెల్లవారుజామున ఆరోరా లైఫ్ సైన్స్ పరిశ్రమలో భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. ఎంబి 2 బ్లాక్ లో రియాక్టర్ పేలడంతో ఈ అగ్నిప్రమాదం జరిగింది. హుటాహుటిన రెండు అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని ఫైరింజన్లతో మంటలు ఆర్పారు.