
కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్న యూనియన్ బ్యాంక్ లో అగ్ని ప్రమాదం జరిగింది. బ్యాంకు మూసి ఉండడంతో లోపల నుంచి భారీగా పొగ బయటికి వస్తుండంతో ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు స్థానికులు . హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది... బ్యాంకు గేట్లు తీసి మంటలను ఆర్పేసింది సిబ్బంది. దాదాపు 3 గంటల పాటు ఫైర్ సిబ్బంది కష్టపడి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. అయితే, ఈ ప్రమాదంలో భారీగా ఆస్తినష్టం జరిగిందని బ్యాంకు అధికారులు ప్రాథమికంగా వెల్లడించారు. ప్రమాదం జరగడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.