ఖమ్మం జిల్లా: కల్లూరులో అగ్ని ప్రమాదం జరిగింది. అంబేద్కర్ సెంటర్ లోని మెడికల్ షాప్ లో మంటలు అంటుకున్నాయి. కరెంట్ షార్ట్ సర్క్యూట్ తో అగ్నిప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. మెడికల్ షాప్ నుంచి దట్టమైన పొగలు రావడం చూసి స్థానికులు భయాందోళనకు గురయ్యారు. చిన్నగా మొదలైన పొగలు పరిసర ప్రాంతాలను పొగ కమ్మేయడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బందికి రంగంలోకి దిగి మంటలు ఆర్పారు. ఇంతకూ ఈ ప్రమాదం ఎలా జరిగిందని ఆరా తీస్తున్నారు. ప్రమాదం జరిగిన తీరు.. మంటలు ఎక్కడ్నుంచి మొదలై ఎలా వ్యాపించాయి, ప్రమాదం ఎలా జరిగింది తెలుసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. బాధితుడి ఫిర్యాదు ఆధారంగా ఆస్తి నష్టం పై అంచనా వేస్తున్నారు.