మేడ్చల్‎ జిల్లా మునిరాబాద్‎లో భారీ అగ్నిప్రమాదం

మేడ్చల్ పోలీస్టేషన్ పరిధి మునిరాబాద్‎లో అగ్ని ప్రమాదం జరిగింది. పత్తి గోదాంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. గమనించిన కార్మికులు, స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. హుటాహటిన ఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది  ఫైరింజన్ల సహయంతో పత్తి గోదాంలో మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. 

గోదాంలో మంటలు చెలరేగడానికి గల కారణలు ఏంటన్న దానిపై ఆరా తీస్తున్నారు. మంటల ధాటికి గోడౌన్ కూలగా.. ప్రమాదం నుండి కార్మికులంతా సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటనలో కార్మికులకు ఎలాంటి హాని జరగలేదు. ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అధికారులు, కార్మికులు ఊపిరీ పీల్చుకున్నారు. పత్తి గోడౌన్ నుండి పెద్ద ఎత్తున మంటలు రావడంతో స్థానికులు భయాందోళనకు గురి అయ్యారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.