హైదరాబాద్ లో మరో అగ్ని ప్రమాదం జరిగింది. నీలోఫర్ ఆసుపత్రిలోని మొదటి అంతస్తు ల్యాబ్‌లో భారీగా మంటలు చెలరేగాయి. దీంతో ఆసుపత్రి పరిసర ప్రాంతాలు దట్టమైన పోగతో నిండిపోయాయి. వెంటనే సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. ఆస్పత్రిలో భారీ మంటలు చెలరేగటంతో పిల్లలు, తల్లిదండ్రులు, అస్పత్రి సిబ్బంది భయాందోళనకు గురయ్యారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.
ALSO READ:- నాటకాల్లో కేసీఆర్ దిట్ట .. ఎన్నికలొస్తున్నందునే జలవివాదం : మంత్రి జూపల్లి