నోయిడాలో దారుణం.. రిక్షా పేలి ఒకరు మృతి

పటాకులు తీసుకెళ్తున్న ఈ-రిక్షా పేలి ఒకరు మృతి చెందిన ఘటన గ్రేటర్ నోయిడాలో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. నోయిడాలోని దాద్రీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రిక్షా నడిపే పప్పు, అతని సహాయకుడు సల్మాన్ ఊరేగింపు కోసం బాణాసంచా నింపిన ఈ-రిక్షాను తీసుకెళ్తుంటారు. జగన్నాథ యాత్రలో కాల్చిన పటాకులు కొన్ని వచ్చి ఈ-రిక్షాపై పడ్డాయి. దాంతో ఆ రిక్షాలో ఉన్న పటాకులతో పాటు రిక్షా కూడా పేలింది. ఈ ఘటనలో పప్పు, సల్మాన్ లు తీవ్ర గాయ పడ్డారు. ఇద్దరిని దగ్గర్లో ఉన్న హాస్పిటల్ కి తరలించగా చికిత్స పొందుతు సల్మాన్ మరణించాడు. 

ఈ సంఘటనంతా పక్కనే ఉన్న సీసీ కెమెరాలో రికార్డయింది. ఒక్కసారిగా పేలుడు జరగడంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగతో కమ్ముకు పోయింది. పటాకులన్నీ పక్క దుకాణాలపై చెల్లా చెదరుగా పడ్డాయి. రద్దీ ప్రాంతమైనా చాలా తక్కువ మందికి గాయాలవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.