ఆంధ్ర ప్రదేశ్: ఆయిల్ మిల్లులో అగ్ని ప్రమాదం

ఆంధ్ర ప్రదేశ్: ఆయిల్ మిల్లులో అగ్ని ప్రమాదం

ఆంధ్ర ప్రదేశ్ : ఓ ఆయిల్ మిల్లులో అగ్ని ప్రమాదం జరిగింది. బుధవారం పొద్దున ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం తూర్పుగోదావరి జిల్లా.. పీరారం చంద్రాపురం ఊర్లోని శ్రీ చక్రా ఆయిల్ మిల్లులో అగ్నిప్రమాదం జరిగింది. మిల్లులో మంటలు ఎగిసిపడుతుండటంతో బయటకు దట్టమైన పొగ అలుముకుంది. ఘటనా స్థలానికి రెండు ఫైర్ ఇంజన్ లు చేరుకుని మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇప్పటివరకు అందిన సమాచారం మేరకు… ప్రాణనష్టం జరుగలేదు. స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని రక్షణ చర్యలు చేపడుతున్నారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలువలేదు.