రైల్ నిలయంలో అగ్ని ప్రమాదం: భారీ ఆస్తి నష్టం

రైల్ నిలయంలో అగ్ని ప్రమాదం: భారీ ఆస్తి నష్టం

సికింద్రాబాద్ రైల్ నిలయంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. బిల్డింగ్ లోని 7 వ అంతస్తు డ్రాయింగ్ సెక్షన్ లో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న తుకారాంగేట్ పోలీసులు, ఫైర్ సిబ్బంది ఉదయం 5గంటలకు సంఘటనా స్థలికి చేరుకొని మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు.  మంటలు భారీగా చెలరేగడం వల్ల బిల్డింగ్ అంతటా దట్టమైన పొగ వ్యాపించడంతో  ఫైర్ సిబ్బంది మంటలు ఆర్పేందుకు దాదాపు మూడు గంటల పాటు శ్రమించారు. ఎట్టకేలకు పరిస్థితిని తమ అదుపులోకి తెచ్చుకున్న సిబ్బంది.. కాలి బూడిదైన విలువైన ఫైల్స్, ఇతర సామగ్రిని తీసివేసి పనిలో నిమగ్నమయ్యారు. ఈ ప్రమాదంలో భారీగానే ఆస్తి నష్టం జరిగి ఉండవచ్చని పోలీసులు  అనుమానం వ్యక్తం చేస్తున్నారు.