సికింద్రాబాద్ తాజ్ హోటల్ లో అగ్నిప్రమాదం

సికింద్రాబాద్​లోని ఓ హోటల్​ అర్ధరాత్రి అగ్ని ప్రమాదం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్యాట్నీ సెంటర్​లో తాజ్​మహాల్​ హోటల్​నిర్వహిస్తున్నారు. జూన్​ 15 అర్ధరాత్రి హోటల్ లోని కిచెన్​ నుంచి ఒక్క సారిగా పొగ రావడం ప్రారంభం అయింది.

స్థానికులు పొగ రావడాన్ని గుర్తించి యజమానికి సమాచారం అందించారు. హుటాహుటిన వెళ్లిన హోటల్​ యజమాని ఫైర్​ స్టేషన్​ సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే స్థానికుల సాయంతో అగ్నిమాపక సిబ్బంది కలసి మంటలు అదుపులోకి తీసుకువచ్చారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియ రాలేదు. సిటీలో తరచూ అగ్ని ప్రమాదాలు జరుగుతుండటం ప్రజలకు ఆందోళన కలిగిస్తోంది.