హైదరాబాద్లో మరో అగ్నిప్రమాదం... టెంట్ హౌస్లో మంటలు

హైదరాబాద్ లో మరో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.  2023 జూన్ 11 ఆదివారం రోజున బేగంబజార్ కరాచీ బేకరీ సమీపంలోని టెంట్ హౌస్ లో మంటలు చేలరేగాయి.  దీంతో అందులో ఉన్న సిబ్బంది పరుగులు తీశారు.  వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో ఐదు ఫైరింజన్లు అక్కడికి  చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువస్తున్నాయి.

 ముందు జాగ్రత్తగా టెంట్ హౌస్ సమీపంలోని దుకాణాలను పోలీసులు ఖాళీ చేయిస్తున్నారు.  టెంట్ హౌస్ గోదాంలో ఉన్న టెంట్ సామాగ్రి పూర్తిగా అగ్నికి ఆహుతి అయ్యాయి. అగ్నిప్రమాదం జరగడానికి  గల కారణాలు, నష్టపరిహారంపై అగ్నిమాపక సిబ్బంది అరా తీస్తున్నారు.