ఎలక్ట్రిక్ ​బైకుల గోదాంలో అగ్ని ప్రమాదం.. రూ.8 కోట్ల బైకులు, ఇతర సామాగ్రి దగ్ధం

ఎలక్ట్రిక్ ​బైకుల గోదాంలో అగ్ని ప్రమాదం.. రూ.8 కోట్ల బైకులు, ఇతర సామాగ్రి దగ్ధం

మేడిపల్లి, వెలుగు: బోడుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని ఓ ఎలక్ట్రిక్​బైకుల గోదాంలో శనివారం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. రూ.8 కోట్ల ఎలక్ట్రిక్​బైకులు, స్పేర్​పార్టులు, ఇతర సామాగ్రి దగ్ధమైంది. మేడిపల్లి పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రామకృష్ణానగర్ కాలనీలోని వర్స్ గ్లోబల్ ట్రేడ్ ప్రైవేట్ లిమిటెడ్ ఎలక్ట్రిక్​బైక్ గోదాంలో శనివారం సాయంత్రం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. 

అందులోని బైకులు, ఇతర సామాగ్రి కాలిబూడిదైంది. ఎగిసి పడుతున్న మంటలను చూసి స్థానికులు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న ఫైర్​సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని మేడిపల్లి పోలీసులు తెలిపారు. అయితే ఫైర్​యాక్సిడెంట్​పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.