యూనియన్ బ్యాంకులో అగ్నిప్రమాదం.. కీలక ఫైళ్లు దగ్ధం..

తిరుపతి జిల్లా కోట మండలంలోని యూనియన్ బ్యాంకులో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో మేనేజర్ రూంలోని కంప్యూటర్లతో పాటు పలు కీలక ఫైళ్లు దగ్దమైనట్లు తెసులుస్తోంది. షార్ట్ సర్క్యూట్ ద్వారా మంటలు వ్యాపించి ఉండవచ్చని భావిస్తున్నారు.

సమాచారం అందుకున్న అనిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు. బ్యాంకు పనివేళలు ముగిసాక ప్రమాదం సంభవించటంతో ప్రనష్టం జరగలేదు. ఘటనకు సంబంధించిన పూర్తీ వివరాలు తెలియాల్సి ఉంది.