జీహెచ్ఎంసీ ఆఫీస్ మూడో అంతస్తులో అగ్ని ప్రమాదం

జీహెచ్ఎంసీ ఆఫీస్ మూడో అంతస్తులో అగ్ని ప్రమాదం

హైదరాబాద్: జీహెచ్ఎంసీ సికింద్రాబాద్ జోనల్ కార్యాలయం మూడో అంతస్తులో అగ్నిప్రమాదం జరిగింది. ఫ్లోర్ లో ఉన్న టాక్స్ సెక్షన్ లో అగ్నిప్రమాదం చెలరేగగా అగ్నిమాపక సిబ్బంది, డి.ఆర్.ఎస్ బృందాలు వెంటనే రంగంలోకి దిగి మంటలను అదుపులోకి తీసుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నాయి. ఒకేసారి మూడు ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపులోకి తీసుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నారు.
మధ్యాహ్నం సమయంలో ఒక్కసారిగా అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడంతో కార్యాలయంలో పనిచేస్తున్న ఉద్యోగులు బయటకు పరుగులు తీశారు.. పెద్ద ఎత్తున పొగలు కమ్ముకోవడంతో ఏం జరిగిందో తెలియక ఉద్యోగులు భయాందోళనకు గురయ్యారు. ముఖ్యమైన ఫైళ్లు ప్రమాదంలో కాలిపోయినట్లు తెలుస్తోంది. అగ్ని ప్రమాదానికి సంబంధించిన కారణాలను తెలియాల్సి ఉంది. 

 

For more news..

జీవో317 ఉద్యోగులకు యమపాశంగా మారింది

సిద్ధార్థ్ క్షమాపణపై స్పందించిన సైనా నెహ్వాల్

కరోనాపై ఆటో డ్రైవర్ అద్భుతమైన మెసేజ్