మేడ్చల్ జిల్లా ఘట్ కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కారులో మంటలు అంటుకోవడంతో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. ఘట్ కేసర్ సమీపంలోని ఘనపూర్ వద్ద ఔటర్ రింగు రోడ్డు సర్వీస్ రోడ్డుపై ఎర్టిగా కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఇద్దరు అక్కడిక్కడే సజీవ దహనం అయ్యారు.
మంటల్లో మృతిచెందిన వ్యక్తిని యాదద్రి జిల్లా బిబి నగర్ మండలం పిలయిపల్లికి చెందిన శ్రీ రామ్(26) గా పోలీసులు గుర్తించారు. శ్రీ రామ్ ప్రస్తుతం యదాద్రి జిల్లా జమిళపేట్ లో ఉంటున్నాడు. వృత్తి రీత్యా నారపల్లి హోల్ సేల్ సైకిల్ షాప్ నిర్వహిస్తాడని స్థానికులు తెలిపారు. మంటల్లో మృతి చెందిన అమ్మాయి వివరాలు తెలియాల్సి ఉంది.
ఉదయం నారపల్లిలోని స్నేహితుడి వద్ద ఎర్టిగా కారు తీసుకొని బయటకు వచ్చాడని సమాచారం ఉంది. ఘట్ కేసర్ ఔటర్ రింగ్ రోడ్డు సర్వీస్ రోడ్డు మార్గం నుండి అబ్దుల్లాపూర్ మెట్ వెళ్తుండగా కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అటుగా వెళ్తున్న వాహన దారులు గమనించి ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. ఫైర్ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని మంటలు ఆర్పారు.
ALSO READ | బండరాయితో కొట్టి.. యువకుడి హత్య
మృతిడి తమ్ముడు ఘట్ కేసర్ స్టేషన్ లో ఫిర్యాదు చేయనున్నాడు. ప్రేమ వ్యవహారమే కారణమని తెలస్తోంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.