
సికింద్రాబాద్‌లో జులై 2న స్వల్ప అగ్నిప్రమాదం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రైల్వే స్టేషన్ రెజిమెంటల్ బజార్ ఓ హోటల్ లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో దట్టమైన పొగ చుట్టు పక్కల ప్రాంతాలను ఆవరించింది. క్షణాల్లో మంటలు వ్యాపించాయి. గమనించిన స్థానికులు హుటాహుటిన ఫైర్ స్టేషన్ సిబ్బందికి సమాచారం అందించారు. పోలీసులు బిల్డింగ్‌పైన లాడ్జిలో ఉన్న వారిని ఖాళీ చేయించారు.
ఫైర్ ఇంజిన్ వాహనం వచ్చి మంటలను అదుపులోకి తీసుకువచ్చింది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. పెను ప్రమాదం తప్పిందని అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అధికారులు అనుమతి లేని లాడ్జీలు, హోటళ్లపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేశారు