ట్రాన్స్ఫార్మర్ పేలడంతో రాజేంద్రనగర్లో భారీ అగ్ని ప్రమాదం..

 ట్రాన్స్ఫార్మర్ పేలడంతో రాజేంద్రనగర్లో భారీ అగ్ని ప్రమాదం..

రాజేంద్రనగర్ లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది.  కిషన్ బాగ్ రోడ్డు సమీపంలో విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ పేలడంతో  ఒక్కసారిగా  మంటలు చెలరేగాయి. మంటలు ఒక్కసారిగా సమీపంలో ఉన్న పండ్ల బండ్లకు అంటుకున్నాయి. 

ఈ ప్రమాదంలో ఒక్కసారిగా పేలిన శబ్దం రావడంతో స్థానికులు ఇండ్లలో నుండి బయటకు వచ్చి పరుగులు తీశారు. ప్రమాదం గురించి స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.  ఫైర్ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని మంటలు ఆర్పేశారు.